రైలులో యువతిపై లైంగిక వేధింపులు

76చూసినవారు
హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో యువతిపై ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. విజయవాడ నుంచి విశాఖ వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో యువతి గాఢ నిద్రలో ఉండగా యువకుడు అసభ్యంగా తాకేందుకు ప్రయత్నించాడు. వెంటనే తేరుకున్న యువతి తోటి ప్రయాణికుల సాయంతో అతడిని పట్టుకుని నిర్బంధించింది. విశాఖ పోలీసులు నిందితుడైన యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్