కారు ఢీ.. ఎగిరి పడ్డ యువతి (వీడియో)

137550చూసినవారు
కర్ణాటకలోని బెళగావిలో మంగళవారం షాకింగ్ ఘటన జరిగింది. స్కూటర్‌పై వెళ్తున్న దివ్య సుజయ్ పాటిల్ (23)ని వెనుక నుంచి ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ప్రమాద ధాటికి ఆమె గాలిలోకి ఎగిరి కారుపై పడింది. అనంతరం ఆమెను 50 మీటర్ల దూరం వరకు కారు ఈడ్చుకెళ్లింది. ఈ దుర్ఘటనలో దివ్య తీవ్ర గాయాల పాలైంది. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్