పారిస్ ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో బల్లెం వీరుడు నీరజ్ చోప్రా సత్తా చాటిన విషయం తెలిసిందే. గురువారం రాత్రి జరిగిన జావెలిన్ త్రో ఫైనల్‌లో నీరజ్ రెండో ప్రయత్నంలో 89.45 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంతో సిల్వర్ మెడల్ కైవసం చేసుకున్నాడు. అయితే సిల్వర్ గెలుచుకున్న అనంతరం బాధతో ఉన్న నీరజ్‌ను బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ దగ్గరికి తీసుకుని ఓదార్చాడు. నీరజ్‌ను హగ్ చేసుకున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.