నాకేం అద్దాల మేడ లేదు : మోదీ

65చూసినవారు
నాకేం అద్దాల మేడ లేదు : మోదీ
దిల్లీ డెవలప్‌మెంట్ అథారటీ ఆధ్వర్యంలో నిర్మించిన పలు నివాస సముదాయాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఆమ్ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై మండిపడ్డారు. సీఎం అధికారిక నివాసం పునరుద్ధరణ వివాదాన్ని ప్రస్తావిస్తూ..దేశంలో 4 కోట్ల మంది సొంత ఇంటి కలను నెరవేర్చామని, తానేమీ అద్దాల మేడ కట్టుకోలేదని తెలిపారు. ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ఆప్ ప్రభుత్వం విఫలమైందని చెప్పారు.

సంబంధిత పోస్ట్