ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ శుభవార్త చెప్పారు. ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ సేవలను మరింత చేరువ చేసేందుకు 2025 మే లేదా జూన్ నాటికి ఈపీఎఫ్ఓ మొబైల్ అప్లికేషన్తో పాటు, ఈపీఎఫ్ఓ ఖాతాలోని డబ్బును ఏటీఎంల్లో కూడా విత్ డ్రా చేసుకునేలా డెబిట్ కార్డ్ సదుపాయం తీసుకొస్తామని ఆయన తెలిపారు. ఈపీఎఫ్ఓ 2.0లో భాగంగా.. ఈ వ్యవస్థలోని మొత్తం సాంకేతిక పరిజ్ఞానాన్ని అప్గ్రేడ్ చేసే దిశగా కేంద్రం ముందుకెళుతున్న సంగతి తెలిసిందే.