గ్యాస్ ట్రబుల్ ఉందని వెళితే గజ్జి, దురదకు టానిక్ ఇచ్చిన వైద్య సిబ్బంది

58చూసినవారు
గ్యాస్ ట్రబుల్ ఉందని వెళితే గజ్జి, దురదకు టానిక్ ఇచ్చిన వైద్య సిబ్బంది
TG: మెదక్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. టెక్మాల్ మండలం ఎలకుర్తికి చెందిన ఓ వృద్ధురాలు గ్యాస్ ట్రబుల్ ఉందని దవాఖానకు వెళ్తే.. వైద్య సిబ్బంది గజ్జి, దురదకు సంబంధించిన టానిక్ ఇచ్చారు. వృద్ధురాలు ఆ టానిక్ తాగడంతో అస్వస్థతకు గురైంది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తప్పుడు టానిక్ ఇచ్చిన వైద్య సిబ్బందిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బాధితురాలి కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్