రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు వసుంధర రాజే కాన్వాయ్ ఆదివారం సాయంత్రం ప్రమాదానికి గురైంది. పోలీసులు ప్రయాణం చేస్తోన్న వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు పోలీసులు గాయపడ్డారు. పాలీ జిల్లాలోని రోహత్, పానిహరి కూడలి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. బైక్ రైడర్‌ను రక్షించే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.