కోడి పందేలు లేకుండా సంక్రాంతి పండుగను ఊహించుకోలేం. కోస్తాంధ్రలో అయితే ఏకంగా రూ.కోట్లలో కోడి పందేలు నిర్వహిస్తుంటారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో బుధవారం ఏకంగా రూ.కోటి ఇరవై అయిదు లక్షలతో పందేం నిర్వహించారు. నెమలి పుంజు, రసంగి పుంజులతో గుడివాడ ప్రభాకర్ రావు, రాతయ్య ఈ పందేం నిర్వహించారు. హోరాహోరీగా సాగిన పందెంలో గుడివాడ ప్రభాకర్ కు చెందిన నెమలి పుంజు రూ.కోటి ఇరవై అయిదు లక్షలు గెలుపు కుంది.