నటి పాయల్ ముఖర్జీ కారుపై దుండగులు దాడి

541చూసినవారు
నటి పాయల్ ముఖర్జీ కారుపై దుండగులు దాడి
కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య తర్వాత దేశవ్యాప్తంగా మహిళల భద్రతపై చర్చ సాగుతోంది. ఈ సమయంలో పశ్చిమబెంగాల్‌లో శుక్రవారం ఊహించని ఘటన జరిగింది. నటి పాయల్ ముఖర్జీ కారుపై దుండగులు దాడి చేశారు. బైక్‌పై వచ్చిన దుండగులు ఆమె కారు అద్దాన్ని పగులగొట్టారు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ఆమె ఫేస్‌బుక్ లైవ్‌లో వెల్లడించారు. ఆమె బెంగాలీతో పాటు తెలుగు, హిందీ సినిమాల్లో నటించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్