ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి రూరల్ మండంలోని సీనియర్ నాయకులకే కేటాయించాలని కాంగ్రెస్ పార్టీకి కొలం సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు కోడప సోనేరావు డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్ లో ఆదివాసి సంఘాల నాయకులతో ఆదివారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సోనేరావు మాట్లాడుతూ. ఇతర మండలాల వారికి చైర్మన్ పదవిని కేటాయించవద్దన్నారు. కేటాయిస్తే ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు.