విద్యార్థుల ఏకరూప దుస్తులను త్వరగా పూర్తి చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా అన్నారు. బుధవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయా శాఖలకు చేరుకున్న క్లాత్‌ను విద్యార్థుల వారీగా కొలతలు తీసుకుని, మహిళా శక్తి కుట్టు కేంద్రాలకు దుస్తులు కుట్టుటకు అప్పగించాలని డిఆర్డిఓ, మేప్మా పిడిని ఆదేశించారు. నిర్లక్ష్యం వహించకుండా సకాలంలో పూర్తి చేసి విద్యార్ధులకు అందించాలని పేర్కొన్నారు.