పురుగుమందుల వినియోగంతో మన దేశంలోని ఎంతో భూభాగం బంజరు భూమిగా మారుతోంది. అయితే సస్యగవ్యతో బంజరు భూమిలో సైతం బంగారు పండించవచ్చని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. సస్యగవ్య తయారీకి మూలం కలుపు మొక్కలు. ఒక కిలో కలుపు మొక్కలకు కిలో ఆవు పేడ, ఒక లీటర్ ఆవు మూత్రం, రెండు లీటర్ల నీటిని కలిపి రోజూ కలియబెడుతూ 10-12 రోజులు మాగబెట్టాలి. ఇలా తయారైన ద్రావణాన్ని పొలంలో పిచికారీ చేస్తే బంజరు భూమి కూడా సారవంతంగా తయారవుతుంది.