వాంకిడి మండలం ఇందాని గ్రామంలో శుక్రవారం సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చాట్లే ప్రకాష్ అనే వ్యక్తి ఇల్లు దగ్ధమైంది. ప్రమాదవశాత్తు ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఆ లోపే ఇంట్లో ఉన్న నిత్యావసర సరుకులతో పాటు నగదు, 30 క్వింటాళ్ల పత్తి, విలువైన సామాగ్రి కాలిపోయింది. దాంతో సుమారు రూ.5 లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లినట్టు బాధితుడు తెలిపారు.