సంక్షేమ హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో సోమవారం హైదారాబాద్ లోని సంక్షేమ భవన్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి కొమరం భీం జిల్లా నుండి నాయకులు హాజరు అయ్యారు. వారు మాట్లాడుతూ, నిత్యావసరాల ధరలు అధికంగా ఉండడం వలన విద్యార్థులకు మెనూ ప్రకారం మెనూ అందడం లేదన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మాస్కే నగేష్,తదితరులు పాల్గొన్నారు.