Feb 26, 2025, 17:02 IST/
రేపు ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఓటు వేయనున్న సీఎం చంద్రబాబు
Feb 26, 2025, 17:02 IST
ఏపీలో ఈ నెల 27 న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోరాష్ట్ర సీఎం చంద్రబాబు తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. గురువారం ఉదయం 9 గంటలకు తన నివాసం నుంచి బయలుదేరి ఉండవల్లిలోని గాదె రామయ్య సీతారావమ్మ ఎంపీయూపీ స్కూల్ కు చేరుకుంటారు. అక్కడ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అనంతరం 9.20కి ఉండవల్లి నివాసానికి చేరుకోనున్నారు.