తాండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కిష్టంపేట గ్రామంలో తన ఇంట్లో గంజాయి మొక్కలను పెంచుతున్న కామెర దుర్గయ్య అనే వ్యక్తిని సోమవారం అరెస్ట్ చేసినట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు సిబ్బందితో కలిసి తనిఖీ చేయగా ఇంటి వెనకాల పెరటిలో 8 గంజాయి మొక్కలు లభ్యమైనట్లు పేర్కొన్నారు. గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకొని దుర్గయ్యపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.