8సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి ఆదరించిన కుప్పం ప్రజల రుణం ఎప్పటికీ తీర్చుకోలేదని సీఎం చంద్రబాబు అన్నారు. గత పాలకులు కక్షపూరితంగా కుప్పం అభివృద్ధిని అడ్డుకున్నారని, టీడీపీ కార్యకర్తలను ఇబ్బందులపాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండో రోజు కుప్పంలో పర్యటిస్తున్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై కుప్పం అభివృద్ధి అన్ స్టాపబుల్ అని, నియోజకవర్గాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకే స్వర్ణ కుప్పం విజన్ 2029 నిర్ధేశించుకున్నామని చెప్పారు.