రేపటి నుంచి ప్రారంభమయ్యే సమగ్ర ఇంటింటి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ తెలిపారు. మంగళవారం బెల్లంపల్లి పద్మశాలి భవన్లో ఎన్యుమరేటర్లకు నిర్వహించిన అవగాహన సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత, కమిషనర్ శ్రీనివాసరావుతో కలిసి ఆయన మాట్లాడారు. ఇంటింటికి తిరుగుతూ సంబంధిత వివరాలు తీసుకోవాలని సూచించారు.