తాండూర్ మండలంలోని అచ్చులాపూర్ గ్రామానికి చెందిన వేద పండితులు అప్పల శ్యామ్ ప్రణీత్ శర్మ ఆంధ్ర ప్రదేశ్ లోని విజయనగరం పట్టణంలో జరుగుతున్న ప్రపంచ వ్యాప్త వాల్మీకి రామాయణ మహాసదస్సులో పాల్గొన్నారు. రామాయణంలో అనేక సందర్భాల్లో వచ్చే యజ్ఞ యాగాది క్రతువులు, వాటికి చేయాల్సిన విధానాలపై పరిశోధన పత్రాలను సమర్పించారు. 40 మంది పండితులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి పరిశోధన పత్రాలను సమర్పించినట్లు ఆయన తెలిపారు.