అసాంఘిక శక్తులపై మరింత కఠినంగా వ్యవహరిస్తామని రామగుండం సిపి శ్రీనివాస్ హెచ్చరించారు. కన్నెపల్లి పోలీస్ స్టేషన్ ను ఆయన తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే వారికి సత్వర న్యాయం జరుగుతుందని నమ్మకం కల్పించాలని సూచించారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలన్నారు.