సమగ్ర కుటుంబ సర్వేలో ఏ ఒక్క ఇంటిని మినహాయించకుండా పక్కాగా సర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సిబ్బందికి సూచించారు.
తాంసి మండల కేంద్రంలో నిర్వహిస్తున్న సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను గురువారం ఆయన పరిశీలించారు. వివరాల నమోదుపై ఆరా తీశారు. పొరపాట్లు లేకుండా చూడాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో మోహన్, తహసీల్దార్ లక్ష్మీ, డిటి గణేష్ తదితరులున్నారు.