బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గంగారెడ్డి ఆధ్వర్యంలో స్వతంత్ర సమరయోధులు, మహాత్మా గాంధీ జయంతి, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతిలను ఘనంగా నిర్వహించారు. ముందుగా వారి చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. భారతజాతి ఐక్యత కోసం, స్వేచ్ఛ సమానత్వం కోసం, స్వాతంత్రం కోసం గాంధీ పోరాడితే, తెచ్చుకున్న స్వతంత్ర ఫలాలను ప్రజలందరికీ అందే విధంగా మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి కృషి చేశారని పేర్కొన్నారు.