నెరడిగొండ: విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్

66చూసినవారు
నెరడిగొండ మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాన్ని బుదవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా సందర్శించారు. ఈ సందర్భంగా వంటగదిని పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. అనంతరం విద్యార్ధులతో కలసి జిల్లా కలెక్టర్ భోజనం చేశారు. అంతకుముందు విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలపై అరా తీశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్