తలమడుగు మండలం ఝరి పున్నగూడ పంచాయతీ పరిధిలోని టోక్కిగూడ, షేర్‌గూడ గ్రామాలను కలిపి టోక్కిగూడను నూతన పంచాయతీగా చేయాలని స్థానికులు కోరారు. సోమవారం రెండు గ్రామ ప్రజలు తలమడుగు తహసీల్దార్ రాజ్‌మోహన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ విషయంపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తాసిల్దార్ అన్నారు. కార్యక్రమంలో సిడం జానక్‌పటేల్, పెందూర్ శంకర్ పటేల్, సిడం లక్ష్మణ్, మాడవి జైరాం, పెందూర్ జంగు, తదితరులు ఉన్నారు.