రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు
గుడిహత్నూర్ మండలంలోని మన్నూరు గ్రామ సమీపంలోనీ హెచ్పి పెట్రోల్ పంప్ వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన మేరకు ధమాన్ గూడా గ్రామానికి చెందిన సిడం కేశవ్ అనే వ్యక్తి తన భార్య సిడం కవిత, కొడుకుతో ద్విచక్ర వాహనంపై ఇచ్చోడ వెళుతున్న క్రమంలో వెనుక నుండి మరో ద్విచక్ర వాహనం ఢీకొన్నది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులకు ప్రథమ చికిత్స చేసి అంబులెన్స్ లో రిమ్స్ కు తరలించారు.