షూటింగ్‌లో బాలీవుడ్ హీరో, నటుడు ఇమ్రాన్ హష్మికి గాయాలయ్యాయి. అడివి శేష్ హీరోగా నటిస్తున్న గూఢచారి-2 సినిమాలో ఇమ్రాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమా సెట్‌లో ఇమ్రాన్ హష్మి గాయపడ్డాడు. హైదరాబాద్‌లో వేసిన సెట్‌లో మెగా యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్న నేపథ్యంలో డూప్ లేకుండా ఇమ్రాన్ హష్మి పాల్గొనడంతో అతడి మెడకు గాయాలయ్యాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.