గుడిహత్నూర్ మండలం గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం రాత్రి మండలంలోని సీతగొందిలో జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఎస్సై ఇమ్రాన్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని సీతాగొంది గ్రామానికి చెందిన రాజస్థానీ ధాబా యజమాని భీర్ల రవీందర్ (47) రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో రవీందర్ కు తీవ్ర గాయాలు కావడంతో గ్రామస్థులు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.