ఇచ్చోడ: రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయం
ఇచ్చోడ మండలం గేర్జం గ్రామ సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన ప్రకారం గిర్జం గ్రామ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరికి తలకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదనికి కారణం అతి వేగంగా ఆజాగ్రత్తగా నడపడం అని స్థానికులు అన్నారు. ప్రమాదంలో గాయాల పాలైన వ్యక్తిని స్థానికులు ఇచ్చోడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.