ఇచ్చోడ మండలం బోరిగామ గ్రామపంచాయతీ పరిధిలోని శ్రీరామ లక్ష్మణ జైశ్రీరామ్ గోశాలకు వెళ్లే మట్టి రోడ్డు ఈ భారీ వర్షాలకు బురదమయంగా మారింది. దీంతో గోశాలకు ఎలాంటి వాహనాలు వెళ్లడం లేదు. కాగా అక్కడే నివాసం ఉంటున్న గోశాల నిర్వాహకులు రాజేష్ తన కూతురిని నిత్యం పాఠశాలకు ఇలా ఎడ్ల బండి మీద తీసుకెళ్లి స్కూలుకు పంపిస్తున్నాడు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఈ రోడ్డును బాగు చేయాలని ఆయన వేడుకుంటున్నాడు.