జైనథ్: భక్తి శ్రద్ధలతో శారదమాత నిమజ్జన వేడుకలు
జైనv మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో శ్రీరామ్ కాలనీ శారదా మండల్ ఆధ్వర్యంలో నిర్వహించిన శారదమాత నిమజ్జన శోభాయాత్ర ఆదివారం ఘనంగా జరిగింది. గ్రామములో ప్రధాన వీధుల గుండా ఈ శోభాయాత్ర ర్యాలీ కన్నుల పండుగగా కొనసాగింది. భక్తి శ్రద్ధలతో డిజె పాటల మధ్య మహిళలు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా ఆకట్టుకున్నాయి. అనంతరం గ్రామ సమీపంలో వాగులో నిమజ్జనం చేశారు.