ఆదిలాబాద్ జిల్లా సరిహద్దున జైనథ్ మండలం డోలారా వద్ద ప్రవహిస్తున్న పెన్ గంగా నది భారీ వర్షానికి ఉధృతంగా ప్రవహిస్తోంది. పెన్ గంగా నది బ్యాక్ వాటర్ కొంత మేరకు పంటపొలాల్లోకి చొచ్చుకుపోయింది. పెన్ గంగా నది ఉధృతి కారణంగా కామాయి గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి.