ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు (వీడియో)

14055చూసినవారు
ప్రపంచం మొత్తం భారతదేశ బడ్జెట్ వైపు చూస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. ‘పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసే మొదటి ప్రసంగం భారత రాజ్యాంగానికి ఇచ్చే గౌరవం. ఆదివాసీలకు, మహిళలకు ఇచ్చే గౌరవం. దేశ ఆర్థిక మంత్రి కూడా మహిళే. ప్రస్తుత పరిస్థితుల్లో యావత్ ప్రపంచం భారత్ వైపే చూస్తోంది' అని మోదీ అన్నారు. అందరి ఆకాంక్షలు నెరవేర్చేలా నిర్మలా సీతారామన్ బడ్జెట్ రూపొందించారని భావిస్తున్నానన్నారు.

సంబంధిత పోస్ట్