బైకు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొనడంతో శ్రీరాంపూర్ బస్టాండ్ ఏరియాకి చెందిన పంగా శ్రీనివాస్ ( 38), రాకేష్ లు ఆదివారం రాత్రి బైక్ పై వస్తూ డివైడర్ను ఢీకొట్టారు. దీంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందగా రాకేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. రాకేష్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. భార్య అమృత ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేసినట్టు ఎస్సై సుగుణాకర్ తెలిపారు.