కుంటాల మండలం కల్లూర్ గ్రామానికి చెందిన ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ గైని రాందాస్ అనారోగ్యంతో ఆదివారం వేకువజామున మృతి చెందాడు. ఆయన గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందాడు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్‌గా గ్రామ వాసులకు ఉపాధి హామీ పనులు చూపించడంలో మంచి పేరు సంపాదించాడని గ్రామస్తులు తెలిపారు.