చెరువులను తలపిస్తున్న అంతర్గత రోడ్లు

56చూసినవారు
భైంసా పట్టణంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి వార్డ్ నంబర్ 7 డబ్బా గల్లీలో అంతర్గత రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై ఏర్పడిన గుంతల్లో నీరు నిలిచి చెరువులను తలపిస్తున్నాయి. దీంతో కాలనీ వాసులు ఇబ్బందులు ఎదురుకొంటున్నారు. అధికారులకు అన్ని సార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్