ఇది ప్రపంచవ్యాప్త సమస్య

53చూసినవారు
ఇది ప్రపంచవ్యాప్త సమస్య
బాలలపై లైంగిక పీడన, వేధింపులు, అఘాయిత్యాలు ప్రపంచవ్యాప్త సమస్యగా మారిందని సుప్రీం కోర్టు ధర్మాసనం పేర్కొంది. ఏ రూపంలోనూ చిన్నారులపై దారుణాలు జరగకూడదనే లక్ష్యంతోనే భారత్‌ 2012లో పోక్సో చట్టాన్ని తీసుకువచ్చింది. లైంగిక విద్యపై, పోక్సో చట్టంలోని నిబంధనలపై పాఠశాల స్థాయి నుంచే అవగాహన కల్పించాలని, విస్తృత స్థాయిలో చైతన్యపరిచే కార్యక్రమాలను చేపట్టాలని సూచించింది. లైంగిక నేరాలకు ఐటీ చట్టంలోని సెక్షన్‌ 67బి ప్రకారం విధించే శిక్షలపైనా ప్రజలకు అవగాహన కల్పించాలంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్