అనారోగ్యం కారణంగా వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం తానూర్ మండలంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ సందీప్ వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన అవదూత్వార్ లచ్చిరాం (59) గత కొన్ని రోజులుగా బోదకాలు వ్యాధితో పాటు కాలికి చేసిన సర్జరీ నొప్పులు భరించలేక తన పక్క చేనులో వేప చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. భార్య గంగాబాయి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు