దుర్గామాతను దర్శించుకున్న కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్
నేరడిగొండ మండలంలోని తేజపూర్ గ్రామంలో గురువారం బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఆడే గజేందర్ దుర్గామాతను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గంలోని ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆడే గజేందర్ కు దుర్గా కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో నియోజవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.