తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ఆదివారము నిర్మల్ లో నిర్వహించే తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ఉద్యమ రథసారధి ప్రో. కోదండరామ్ ఎమ్మెల్సి హాజరు కానున్నట్లు టిపి జేఏసి జిల్లా కన్వీనర్ శ్రీనివాస రాజు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని ఉద్యమకారులందరు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.