న్యూఢిల్లీలో రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్యని ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ కమిటీ కన్వీనర్ డాక్టర్ మనోజ్ యాదవ్, కోకన్వీనర్లు యాటకారి సాయన్న, మూర్తి ప్రభాకర్, నిమ్మ గణేష్, సయ్యద్ చాంద్ పాషాలు ప్రత్యేకంగా గురువారం కలిశారు. ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ నిధులు బడ్జెట్లో ప్రవేశ పెట్టడానికి రాజ్యసభలో మాట్లాడి నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేయాలని కోరారు.