ఎంఈవోలుగా విధులు నిర్వర్తించి విద్యాభివృద్ధికి తోడ్పడాలని జిల్లా విద్యాధికారి ఏ రవీందర్ రెడ్డి అన్నారు. బుధవారం నిర్మల్ పట్టణంలోని ఆయన కార్యాలయంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎంఈఓ లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఆయా మండలాలలో 10వ తరగతి ఉత్తీర్ణత శాతం పెంచాలని పేర్కొన్నారు.