సారంగాపూర్ మండలం జామ్ గ్రామానికి చెందిన కాంతయ్య(43) నిర్మల్ పట్టణ శివారులో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్మల్ గ్రామీణ ఎస్ఐ లింబాద్రి గురువారం తెలిపారు. కాంతయ్య కొద్ది రోజుల క్రితం ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. అక్కడ సరైన ఉపాధి దొరకక తిరిగి గ్రామానికి వచ్చాడు. దీంతో జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.