రష్యాలో బ్రిక్స్ దేశాల సమ్మిట్లో పాల్గొన్న ప్రధాని మోదీ తిరిగి స్వదేశానికి పయనమయ్యారు. రష్యాలోని భారత దౌత్య అధికారులు ఆయనకు వీడ్కోలు పలికారు. కజన్లో జరిగిన బ్రిక్స్ దేశాల 16వ శిఖరాగ్ర సదస్సులో మోదీ చైనా, రష్యా సహా పలు దేశాల అధ్యక్షులతో భేటీ అయ్యా రు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, మిడిల్ ఈస్ట్ పరిస్థితులు, వాతావరణ మార్పులు, టెర్రరిజం తదితర అంశాలపై చర్చించారు.