దేశ రక్షణ రంగాన్ని పటిష్టం చేసే దిశగా అమెరికా, భారత్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఈ మేరకు అమెరికాకు చెందిన 31 ఎంక్యూ-9బీ ప్రిడేటర్ డ్రోన్లను కొనుగోలు చేసేందుకు ఒప్పందంపై రెండు దేశాలు సంతకాలు చేసినట్లు సమాచారం. ఈ నిర్ణయంతో భారత సైనిక బలం మరింత పెరగనుంది. అయితే ఈ డ్రోన్లలో భారత నౌకాదళానికి 15 డ్రోన్లు దక్కనున్నట్లు తెలుస్తోంది. ఇక ఆర్మీ, వైమానికి దళానికి ఎనిమిదేసి డ్రోన్లను ఇవ్వనున్నారు.