చెస్ట్ ఎక్స్–రేలను ఉపయోగించి క్షయ వ్యాధిని గుర్తించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉపయోగించి కిమ్స్ ఆసుపత్రి అతిపెద్ద పరిశోధన చేసిందని వైద్యులు వెల్లడించారు. క్యూ ఎక్స్‌ఆర్ అనే ఏఐ టూల్‌ను ఉపయోగించి 16,675 మంది పేషెంట్ల చెస్ట్ ఎక్స్–రేలను పరిశీలించారు. ఇందులో ప్రధానంగా రెండు అంశాలపై దృష్టి పెట్టారు. టీబీ కేసులను గుర్తించడంలో ఏఐ టెక్నాలజీ అత్యంత సమర్థవంతమైనదిగా గుర్తించారు.