సుఖేష్ చంద్రశేఖర్ జైలు గదిలో ఎయిర్ కూలర్

64చూసినవారు
సుఖేష్ చంద్రశేఖర్ జైలు గదిలో ఎయిర్ కూలర్
మనీలాండరింగ్ కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ జైలు గదిలో ఎయిర్ కూలర్ ఏర్పాటు చేయాలని ఢిల్లీలోని పటియాల హౌస్ కోర్టు.. జైలు అధికారులను ఆదేశించింది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా తాను చర్మ సమస్యలకు గురయ్యారని, దీంతో తన సొంత ఖర్చుతో ఎయిర్ కూలర్ పెట్టించుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోర్టును సుఖేష్ కోరారు. దీంతో కోర్టు.. సుఖేష్ అభ్యర్థనను అంగీకరించింది.