రైల్వేలో భద్రతా విభాగంలో 1.5 లక్షల పోస్టులు ఖాళీ

67చూసినవారు
రైల్వేలో భద్రతా విభాగంలో 1.5 లక్షల పోస్టులు ఖాళీ
రైల్వే శాఖలో భద్రతా విభాగానికి మంజూరైన సుమారు 10 లక్షల ఉద్యోగాలలో 1.5 లక్షలకు పైగా పోస్టులు భర్తీ చేయకుండా ఖాళీగా ఉన్నాయని కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. చంద్రశేఖర్‌ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా కోరగా అధికారులు ఈ మేరకు సమాధానమిచ్చారు. మొత్తం మంజూరైన లోకో పైలట్ల పోస్టులు 70,093 కాగా, అందులో 14,429 ఖాళీగా ఉన్నాయని వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్