దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, ఆయన భార్య షేఖా షైఖా బింట్ సయీద్ బిన్ థాని అల్ మక్తౌమ్ శనివారం వారి నాలుగో బిడ్డను స్వాగతించారు. ఆడబిడ్డకు 'హింద్'గా నామకరణం చేశారు. షేక్ హమ్దాన్ తన తల్లి షేఖా హింద్ బింట్ మక్తౌమ్ బిన్ జుమా అల్ మక్తౌమ్ గౌరవార్థం నవజాత శిశువుకు 'హింద్' అని పేరు పెట్టారు. క్రౌన్ ప్రిన్స్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో ఈ వార్తను వెల్లడించారు.