AP: టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ కోళ్లతో వినూత్న నిరసన చేపట్టారు. వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు చికెన్ సెంటర్ల నుంచి కేజీకి రూ.10 వసూలు చేస్తున్నారని భూమా అఖిలప్రియ ఆరోపించారు. పేపర్‌లో వచ్చే ధరకే చికెన్ ఇప్పిస్తామని గతంలో ప్రెస్‌మీట్‌లో చెప్పానని, దాని కోసం పోరాటం చేస్తుంటే.. కమీషన్ తీసుకుంటున్నానంటూ సాక్షి పేపర్‌లో నీచంగా రాస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు కర్నూలులోని సాక్షి ఆఫీసు ఎదుట కోళ్లతో వినూత్న నిరసన తెలిపారు.