ఇటీవల వరుసగా బాంబు బెదిరింపుల కారణంగా దేశీయ విమానయాన సంస్థలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. విమానాల ఆలస్యం, రూట్ మార్పులు వంటి అంతరాయాలతో భారీగా ఆర్థిక నష్టాలను చూశాయి. దీనిపై సమీక్ష నిర్వహించిన పరిశ్రమ వర్గాలు విమానాల రూటు మార్చడం వల్ల ఒక్కో ఘటనకు రూ.17 లక్షల వరకు సంస్థలు నష్టపోతున్నాయని వెల్లడించారు.